Pushpa-2 Advance Booking News | ‘పుష్ప-2 ది రూల్’ ( Pushpa-2 The Rule )సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun ), రష్మిక జంటగా సుకుమార్ తెరకెక్కించిన మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
పార్ట్-1 బ్లాక్ బస్టర్ కావడంతో పార్ట్-2 పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే విడుదల కంటే ముందే పుష్పరాజ్ రికార్డులను తిరగరాస్తున్నాడు.
పుష్ప-2 హిందీ వెర్షన్ ( Hindi Version )టికెట్లు ఆన్లైన్ లో విడుదల అయ్యాయి. అయితే ప్రీ సేల్స్ ( Pre Sales ) లో పుష్ప-2 దూసుకెళ్తుంది. టికెట్లు విడుదలైన 24 గంటల్లోనే హిందీ వెర్షన్ లో లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి.
కేవలం 24 గంటల్లోనే లక్ష టికెట్లు అమ్ముడైన మూడవ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. షా రూఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) నటించిన పటాన్ లక్ష 17 వేలు, మరో సినిమా జవాన్ లక్ష 55 వేలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఇకపోతే కేవలం ప్రీ సేల్స్ ద్వారానే రూ.60 కోట్ల మార్కును దాటేసింది. ఈ క్రమంలో పుష్ప-2 తొలిరోజు కలెక్షన్లు ఆర్ఆర్ఆర్, బాహుబలి-2, కేజిఎఫ్-2 ను కూడా దాటేసే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.