Pushpa 2 Dialogues Row | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun)కథానాయకుడిగా వచ్చిన పుష్ప-2 ది రూల్ (Pushpa The Rule) బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే మూవీలోని డైలాగ్స్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ నడుస్తోంది.
మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య వివాదాన్ని పెంచే విధంగా డైలాగులు ఉన్నాయని పలువురు పోస్టులు పెడుతున్నారు. కానీ సినిమాలోని డైలాగ్స్ ను వక్రీకరించి ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) స్పందించింది. ‘ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.
వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.’ అంటూ పుష్ప-2 నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.