Polling Day | తెలంగాణలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు పోలింగ్ స్టేసన్లు, పోలింగ్ బూత్ లలో అన్ని ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఓటేసేందకు సొంతూర్లకు బయలు దేరుతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో స్కూళ్లకు, ఐటీ, ఇతర కంపెనీలకు కూడా ఎన్నికల సంఘం సెలవు తప్పనిసరి చేయడంతో హైదరాబాద్ నుంచి చాలామంది తమ స్వస్థలాలకు వెళుతున్నారు.
దీంతో నగరంలోని సికింద్రాబాద్ (Secunderabad), కాచిగూడ (Kacheguda) రైల్వేస్టేషన్లతోపాటు, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి.
ఇక నగర శివార్లలలోని ప్రాంతాల్లో రోడ్లు సొంతూర్లకు వెళ్లేవారితో క్కికిరిసి పోతున్నాయి. నగరంలోని ఉప్పల్ నుంచి వరంగల్ రూట్ లో ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున బస్టాపుల్లో నిరీక్షిస్తున్నారు.
దాదాపు నగరంలోని అన్ని శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఈసీ భావిస్తోంది.