Priyanka Chopra shares a life lesson from guava seller | తనకు ఎదురైన జామపళ్ళు అమ్మే మహిళ ప్రవర్తన తనను ఎంతగానో ఆకట్టుకుందని నటి ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.
ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఎస్ఎస్ఎంబీ 29 మూవీలో నటిస్తున్న విషయం తెల్సిందే.
రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ఒడిశా షెడ్యూల్ ఇటీవలే పూర్తయ్యింది. షూటింగ్ ముగియగానే ప్రియాంక చోప్రా న్యూ యార్క్ కు వెళ్లిపోయారు. అంతకంటే ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న మార్గ మధ్యలో జామపళ్ళు కనిపించాయని, తనకు అవంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పారు.
ఈ క్రమంలోనే పళ్ళ ధర అడగగా, మహిళ రూ.150 చెప్పగా, రూ.200 నోటు ఇచ్చి కొనుగోలు చేసినట్లు ప్రియాంక తెలిపారు. పళ్ళు అమ్మే మహిళ చిల్లర ఇవ్వబోగ వద్దని చెప్పినట్లు పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయిన మహిళ కాసేపటికే తిరిగి వచ్చి మరికొన్ని పళ్ళు ఇచ్చినట్లు, ఈ ఘటన తనకు చాలా స్ఫూర్తినిచ్చినట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
ఎందుకంటే ఆ మహిళ సాయాన్ని కోరుకోలేదు, ఆమె నిజమైన వర్కింగ్ ఉమెన్..సదరు మహిళ ప్రవర్తన తన మనసును గెలుచుకుందని ప్రియాంక చోప్రా వివరించారు.