New Governors For 3 States | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను (News Governors For 3 States) నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
హరియాణా గవర్నర్ (Haryana Governor)గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ (Prof. Ashim kumar ghosh), లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తా (Kavinder Gupta), గోవా గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు (Pusapati Ashok Gajapati Raju)లను రాష్ట్రపతి నియమించారు.
ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత అయిన అశోక్ గజపతి రాజు 25 ఏళ్లకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పదమూడు ఏళ్లపాటు ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
వాణిజ్య పన్ను, ఎక్సైజ్, శాసనసభ వ్యవహారాలు, ఆర్థికం, ప్రణాళిక మరియు రెవెన్యూ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 2014లో ఎన్నికైన మోదీ కేబినెట్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు.







