Sunday 11th May 2025
12:07:03 PM
Home > తాజా > ప్రభాస్ ఫోటో లీక్..కన్నప్ప మూవీ టీం కీలక నిర్ణయం

ప్రభాస్ ఫోటో లీక్..కన్నప్ప మూవీ టీం కీలక నిర్ణయం

Prabhas Look From Kannappa Movie Leaked | మంచు విష్ణు ( Manchu Vishnu ) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) కీలక రోల్ లో కనిపించనున్నారు.

అయితే తాజాగా కన్నప్ప మూవీ నుండి ప్రభాస్ లుక్ లీక్ ( Leak ) అయ్యింది. ప్రస్తుతం ప్రభాస్ ఫోటో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ టీం స్పందించింది.

గత రెండు సంవత్సరాలుగా ఎంతో శ్రమించి కన్నప్ప మూవీని పూర్తి చేయడానికి టీం కష్టపడుతున్నట్లు, కానీ ఇలాంటి సమయంలో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ( Work In Progress ) ఇమేజ్ ( Image ) అనధికారికంగా లీక్ అవ్వడం చాలా బాధకలిగిస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది.

ఈ ఒక్క ఫోటో లీక్ అవ్వడం ప్రాజెక్ట్ పై పనిచేస్తున్న 2000 మందికి పైగా VFX కళాకారుల జీవితాలను ప్రభావితం చేస్తుందని టీం తెలిపింది. లీక్ ఎలా జరిగింది అని తెలుసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే లీక్ చేసిన వారిని ఎవరైనా పట్టుకుంటే రూ.5 లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

You may also like
‘దేశ రక్షణ నిధికి ఏపీ స్పీకర్ విరాళం’
‘పాక్ కు లోన్..IMF పై విరుచుకుపడ్డ ఒవైసీ’
‘భారత్-పాక్ ఉద్రిక్తతలు..డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన’
‘పాక్ లో పట్టుబడ్డ భారత పైలట్..నిజం ఏంటంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions