Ponnala Lakshmaiah News | మాజీ మంత్రి, బీఆరెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ.లక్షన్నర నగదుతో పాటు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణదేవి ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.