వలిగొండ : మండల ప్రజలందరికీ వలిగొండ పోలీసు వారి హెచ్చరిక రాబోయే 48 గంటల లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు. కావున వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లే ప్రమాదం ఉంది కావున
ప్రజలు ఎదైనా ప్రయాణాలు టూర్లు ముందే అనుకొని ఉంటే అట్టి ప్రయాణాలు 48 గంటలు వాయిదా వేసుకోండి, అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటకు రావొద్దు, రోడ్ల పై నుండి వరద నీరు వెళ్లే ప్రమాదం ఉంది అలా వరద నీరు ప్రవహిస్తున్నపుడు ప్రజలు ఏమవుతుంది లే అని అట్టి రోడ్లు దాటితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కావున ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి రోడ్లు దాట రాదు, అకస్మాత్తుగా చెరువుల కట్టలు తెగిన నీటి ప్రవాహం పెరిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి, ప్రజలు వర్షం వల్ల ఎదైనా సమస్య వస్తే వెంటనే 100 నంబర్‌కి కాని, 8712662484(ూఱవలిగొండ) నెంబర్‌కి కాల్ చేయగలరు.. ఈ భారీ వర్షాల నేపథ్యంలో మత్యకారులు చేపలు పట్టుటకూ చెరువులలోకి వెళ్లారాదు. చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు సురక్షిత ప్రాంతాలలో ఉండాలి, అవసరం అయితే పోలీస్ వారు పునరావాసం కల్పించబడును. కరెంటు స్తంభాలు ముట్టుకోరాదు…