Friday 9th May 2025
12:07:03 PM
Home > తాజా > బుల్డోజర్ల వ్యాఖ్యలు..సీఎం రేవంత్ పై పోలీసులకు ఫిర్యాదు

బుల్డోజర్ల వ్యాఖ్యలు..సీఎం రేవంత్ పై పోలీసులకు ఫిర్యాదు

Police Complaint Against Cm Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆరెస్ ( BRS ) నాయకులు.

అక్టోబర్ 19న చార్మినార్ ( Charminar ) వద్ద జరిగిన సద్భావన యాత్ర సందర్భంగా బీఆరెస్ అధినేత కేసీఆర్ ( KCR ), కేటీఆర్ ( KTR ), హరీష్ రావు ( Harish Rao )లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బంజారాహిల్స్ ( Banjarahills ) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బుల్డోజర్లతో తొక్కిస్తా అంటూ తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, సీఎం భయబ్రాంతులకు గురి చేశారని ఆ పార్టీ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ( Gellu Srinivas Yadav ) మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు సదరు వీడియోల సీడీలను ఫిర్యాదుకు జత చేసినట్లు చెప్పారు.

దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కేసును నమోదు చేయాలని వారు కోరారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నట్లు సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు.

అంతేకాకుండా తమ పార్టీ నాయకులకు ఎటువంటి హాని జరిగినా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

You may also like
‘గెలవాలని మొక్కుకున్న 96 ఏళ్ల వృద్ధురాలు..అభిమానిని కలిసిన పవన్’
అయ్యా మాకు లోన్లు ఇవ్వండి..పాక్ భిక్షాటన !
‘ఒక నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళం గా ఇద్దాం’
‘భారత్ vs పాక్..అంబటి రాయుడిపై ఫైర్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions