Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దసరా నాడు చెత్తకుండిలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న పోలీస్

దసరా నాడు చెత్తకుండిలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న పోలీస్

Police Adopts New Borngirl Found In Bushes | ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మే ఇంటికి వచ్చిందని అనుకుంటారు. కానీ అప్పుడేపుట్టిన ఓ చిన్నారిని తల్లి చెత్తకుప్పలో వదిలేసి వెళ్ళింది. ఈ అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) లోని ఘజియాబాద్ ( Gaziabad ) లో చోటుచేసుకుంది.

చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లికోసం పోలీసులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

దింతో ఆడబిడ్డ పరిస్థితిని చూసిన ఓ పోలీస్ చలించిపోయారు. పసికందును దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. పుష్పేంద్ర సింగ్ ( Sub-Inspector Pushpendra Singh )దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే వారికి సంతానం కలగలేదు.

ఈ క్రమంలో చెత్తబుట్టలో దొరికిన చిన్నారిని దత్తత తీసుకోవాలని వారు భావించారు. దత్తత కోసం చట్టపరమైన ప్రక్రియను మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పుష్పేంద్ర సింగ్ విజయదశమి నాడు స్వయంగా దుర్గమ్మే చిన్నారి రూపంలో తమ వద్దకు వచ్చిందన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ పుష్పేంద్ర సింగ్ మానవత్వానికి అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions