PoK Ex PM Admits Pakistan’s Hand In Delhi Car Blast | ఫరీదాబాద్ లో ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ బహిర్గతం అయిన రోజే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు జరిగిన విషయం తెల్సిందే. ఈ దాడికి పాల్పడింది కూడా టెర్రర్ మాడ్యూల్ లో భాగమైన ఉమర్ నబీనే అనే విషయం తెల్సిందే.
ఇదే సమయంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ మాజీ ప్రధాని చౌదరీ అన్వర్ ఉల్ హాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో భారత్ లో జరుగుతున్న ఉగ్రదాడులు వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనేది తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వరకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రధానిగా కొనసాగిన చౌదరీ అన్వర్ స్థానిక అసెంబ్లీలో తాజగా మాట్లాడారు. మా షాహీదులు ఎర్రకోట బ్లాస్ట్ చేసి చూపించారు అంటూ ఉగ్రవాదులకు పాక్ మద్దతును బహిరంగంగా అంగీకరించారు.
చౌదరీ అన్వర్ మాట్లాడుతూ ‘మీరు అంటే భారత్ బలూచిస్తాన్ లో రక్తపుటేరులు పారిస్తున్నారు అంటే మేము ఎర్రకోట నుండి కశ్మీర్ అడవుల వరకు దెబ్బతీస్తామని ముందే చెప్పాము. మా షాహీన్లు అంటే ఉగ్రవాదులు అది చేసి చూపించారు. భారత్ ఇంకా శవాల సంఖ్యను లెక్కించలేకపోతుంది’ అంటూ విర్రవీగాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.









