Modi Telangana Tour Schedule | ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) తెలంగాణ పర్యటించనున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మోదీ ఈనెల జూలై 8 రాష్ట్రానికి రానున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది (Modi Telangana Tour Schedule).
జూలై 8న ఉదయం 9.45 గంటలకు మోదీ హైదరాబాద్ చేరుకోనున్నారు. 9.45 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
9 : 50 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు పయనమవుతారు. ఉదయం 10:35 గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు. 10:45 నుంచి 11:20 వరకు పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు.
మొదట కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు (Warangal Mega Textile Park)కు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
11:30 నుంచి మధ్యాహ్నం 12:10 గంటల వరకు నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు హాజరవుతారు.
మధ్యాహ్నం 12:15 గంటలకు వరంగల్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 1.10 గంటలకు హకీంపేట్ విమానాశ్రయం నుంచి రాజస్థాన్ తిరుగు పయనమవుతారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో మోదీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ (Bandi Sanjay) ని తప్పించిన అధిష్టానం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Gangapuram Kishan Reddy) తిరిగి బాధ్యతలు అప్పగించింది.
ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి సారథ్యంలో మోదీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో ప్రధాని పర్యటనపై బీజేపీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.









