Saturday 28th February 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘సింధూర్’..ఆపరేషన్ కు ఈ పేరు అందుకే పెట్టారు!

‘సింధూర్’..ఆపరేషన్ కు ఈ పేరు అందుకే పెట్టారు!

PM Modi named it Operation Sindoor | జమ్మూకశ్మీర్ పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన దాడుల్లో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారు.

అయితే ఉగ్రవాదులు భార్య, పిల్లల ముందే పురుషుల మతాన్ని అడిగి, హిందువులు అని ఖరారు చేసుకున్న తర్వాతే పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా ఉన్న పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు ఆశించాడు.

ఇందుకు తగ్గట్టుగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం వేకువజామున ఇంటి గంట ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ ను చేపట్టాయి.

ఈ ఆపరేషన్ ద్వారా పాక్ లోని 9 ప్రాంతాల్లో 21 ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా దళాలు విరచుకుపడ్డాయి. ఈ సమయంలో సింధూర్ అని నామకరణం చేయడం వెనుక అర్ధం ఏంటని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

భారత భద్రతా దళాలు పాక్ భూభాగం మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జరిపిన ఆపరేషన్ కు ‘సింధూర్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నామకరణం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్ అనే పేరు చాలా ప్రతీకాత్మకమైనది. హిందూ మహిళలు వివాహానికి చిహ్నంగా నుదుటన సిందూర్ ను పెట్టుకుంటారు. అయితే పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను అతి దారుణంగా ఉగ్రవాదులు చంపేశారు.

దింతో అనేక కుటుంబాలను నాశనం అయ్యాయి. బాధితులను చుట్టుముట్టి, వారి మతాన్ని అడిగి, వారి భార్యలు మరియు పిల్లల ముందు కాల్చి చంపారు. అందువల్ల, వారి మరణాలకు ప్రతీకారం తీర్చుకునే ఆపరేషన్‌కు ‘సింధూర్’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

భారత సైన్యం విడుదల చేసిన చిత్రంలో ఆపరేషన్ సింధూర్ బ్లాక్ అక్షరాలలో రాశారు. సిందూర్‌లోని ఒక ‘ఓ’ అక్షరాన్ని మాత్రం కుంకుమ ఉన్న పాత్రను పెట్టారు. 25 మంది మహిళల జీవిత భాగస్వాములను లాక్కున్న క్రూరత్వాన్ని సూచిస్తూ దానిలో కొంత కుంకుమ చెల్లాచెదురుగా పడిపోయింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ ఆపరేషన్ ను చేపట్టారు. “న్యాయం నెరవేరింది. జై హింద్” భారత సైన్యం స్పష్టం చేసింది.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions