Pm Modi Fires On Congress Party | కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రధాని మోదీ ( Pm Modi ). మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం అకోలాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు గాంధీ కుటుంబానికి ఏటీఎం ( ATM ) లాగా మారాయని విమర్శించారు. ఏటీఎం నుండి డబ్బులు తీసుకున్న విధంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల నుండి కాంగ్రెస్ పార్టీ డబ్బులు వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు.
మహారాష్ట్రలో ఎన్నికలు అయితే కర్ణాటక ( Karnataka ), తెలంగాణ ( Telangana ) వంటి రాష్ట్రాల్లో హస్తం పార్టీ వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh ), తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చేసిందని దుయ్యబట్టారు.
మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇప్పటికే కర్ణాటక మద్యం విక్రయదారుల నుండి రూ.700 కోట్లు కొల్లగొట్టారని ప్రధాని ఫైర్ అయ్యారు. కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను విడగొట్టాలని హస్తం పార్టీ భావిస్తుందన్నారు.