Pawan Kalyan returns to Hyderabad along with his injured son | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సతీమణి అన్నాలెజినోవా, కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పొలెనా అంజనా తో చేరుకున్నారు.
మార్క్ శంకర్ ను పవన్ కళ్యాణ్ ఎత్తుకుని ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. సింగపూర్ దేశంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది.
మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై తాజగా డిప్యూటీ సీఎం ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, కొలుకుంటున్నారని పేర్కొన్నారు. అగ్నిప్రమాద ఘటన గురించి తెలుసుకుని మార్క్ శంకర్ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేసి, క్షేమాన్ని కోరుకున్న సినీ, రాజకీయ, కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.
కష్ట సమయంలో అండగా నిలిచి, కుటుంబ క్షేమం కోసం చేసిన ప్రార్ధనలు తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని పవన్ పోస్ట్ చేశారు. అలాగే అగ్నిప్రమాద సంఘటన జరిగిన వెంటనే స్పందించి సింగపూర్ అధికారులతో సమన్వయం చేసి సహాయం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.