Pawan Kalyan Post About Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవిని వెండితెరకు పరిచయం చేసిన సినిమా ‘ప్రాణం ఖరీదు’. సెప్టెంబర్ 22 నాటికి ఈ సినిమా విడుదలై 47 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ఈ నేపథ్యంలో ప్రముఖులు, అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.
‘నాకు ఇప్పటికీ ‘పెద్ద అన్నయ్య’ ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో హీరోగా నటించిన సమయం స్పష్టంగా గుర్తు. అప్పుడు మేము నెల్లూరులో ఉన్నాం, నేను ఇంకా స్కూల్లో ఉన్నాను. మేము కనకమహల్ థియేటర్‌కి వెళ్లాము, ఆ రోజు నాకు కలిగిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో, ఆయన ప్రతి అంశంలోనూ ఎంతగానో ఎదిగారు, అయినా హృదయంలో వినమ్రతను సహాయ గుణాన్ని కోల్పోలేదు, ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. దుర్గమ్మ తల్లి ఆయనకు విజయం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో కూడిన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రానున్న సంవత్సరాల్లో ఆయనను మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో చూడాలని ఆశిస్తున్నాం. ఆయనకు రిటైర్మెంట్ అనేది లేదు, తాను ఎంచుకోనంత వరకు. జన్మతః యోధుడు.. నా పెద్ద అన్నయ్య, శంకర్ బాబు గా ప్రేమగా పిలుచుకునే ‘మెగా స్టార్ చిరంజీవి’’ అని పవన్ పేర్కొన్నారు.









