Operation Mahadev News | భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. పహల్గాంలో అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి హత్య చేసిన వారే ఈ ఉగ్రవాదులు అని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కానీ సైన్యం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. సోమవారం ఉదయం శ్రీనగర్ లోని దాచిగామ్ నేషనల్ పార్కు సమీపంలో నక్కిన ఉగ్రవాదులకు మరియు భారత సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
‘ఆపరేషన్ మహాదేవ్’ పేరుతో భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ను చేపట్టారు. హర్వాన్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
సోమవారం ఉదయం దాచిగమ్ అటవీ ప్రాంతంలో సైన్యం గాలింపు చర్యలు చేపడుతుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దింతో సైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపింది. ఇందులక్ ముగ్గురు ఉగ్రవాదులని సైన్యం మట్టికరిపించింది.
ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా ఉగ్రవాదుల్ని మట్టుపెట్టినట్లు భారత సైన్యంలోని చినార్ కోర్ వెల్లడించింది. మృతిచెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులు అని, వీరికి లష్కరే తయిబాతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. వీరే పహల్గాంలో ఉగ్రదాడి చేసినట్లు తెలుస్తోంది.









