Sunday 20th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > AI సహాయంతో గంటలోపే శ్రీవారి దర్శనం

AI సహాయంతో గంటలోపే శ్రీవారి దర్శనం

One-Hour Darshan Option At Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా చేస్తున్న ప్రయత్నానికి కార్యచరణ ప్రారంభమయిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ( BR Naidu ) పేర్కొన్నారు.

వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని గురువారం నుంచి అమలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీని వారం రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.

ఇది విజయవంతమైతే ఈ నెల 24న జరగనున్న పాలకమండలిలో ఆమోదం లభించనుంది. గంటలోపే దర్శనం చేయించడానికి మొదటగా వారి ఆధార్‌ కార్డు నంబర్‌, ఫేస్‌ రికగ్నేషన్‌ రసీదు ఇస్తారు. అందులో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్‌ అందిస్తారు.

ఈ టోకెన్‌ తీసుకున్న సందర్శకులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్దకు చేరుకోగానే ఫేస్‌ రికగ్నిషన్‌ ఎంట్రన్స్‌లో స్కానింగ్‌ అనంతరం క్యూ లైన్‌లోకి పంపుతారు. గంట సమయంలోపే స్వామివారి దర్శనం పూర్తవుతుంది.

ఈ టోకెన్ల జారీకి దాదాపు 45 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సిబ్బందితో పని లేకుండా ఎఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయనున్నారు.

ఈ విధానం అమలుకు ఎఐ సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ విధానం సక్సెస్ అయితే భక్తులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని బీఆర్ నాయుడు చెప్పారు.

You may also like
smitha sabharwal
‘వాళ్లందరికీ నోటీసులు పంపారా..’ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్!
‘MMTS అత్యాచారయత్నం కేసు..యువతి మాటలకు షాకయిన పోలీసులు’
UPI లావాదేవీలపై GST..కేంద్రం ఏమన్నదంటే !
‘గిరిజన మహిళల కోసం చెప్పులు పంపిన పవన్ కళ్యాణ్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions