Noida-Based Techie Becomes Rapido Rider To Pay EMIs After Losing His Job | EMIలు చెల్లించేందుకు ఓ ఐటీ ఇంజినీర్ రాపిడో డ్రైవర్ గా మారారు. ఇది టెక్ ఉద్యోగాల డార్క్ రియాలిటీని ప్రతిబింభిస్తోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని నోయిదాకు చెందిన నోమదిక్ తేజు అనే యూజర్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో అతని స్నేహితుడు ఎదురుకుంటున్న దారుణ దుస్థితి గురించి వివరించారు.
‘నోయిదాలోని గౌర్ సిటీలో ఒక్కో అపార్ట్మెంట్ రూ.1 నుండి రూ.2 కోట్ల మధ్య ఉంటుంది. రెండు నెలల క్రితం వరకు నా స్నేహితుడు కూడా ఇక్కడే ఉండేవాడు. అయితే ఉద్యోగ ఒత్తిడి తట్టుకోలేక అలాగే మంచి ఉద్యోగం లభిస్తుందనే ఆశతో రెండు నెలల క్రితం ఐటీ ఇంజినీర్ గా పనిచేస్తున్న అతడు ఉద్యోగాన్ని వదిలేశాడు. కానీ అతనికి వేరే ఉద్యోగం ఇప్పటివరకు దొరకలేదు. హైరింగ్ లు లేకవపోవడమా లేదా ఏఐ ప్రభావమా అనేది తెలీదు. ఉద్యోగం లేకపోవడంతో EMIలు కట్టేందుకు అతడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. కుటుంబ సభ్యుల్ని ఇంటికి పంపాడు. అపార్ట్మెంట్ ను రూ.30 వేలకు రెంట్ కు ఇచ్చేసి అతను మాత్రం బయట చిన్న గదిలో ఉంటున్నాడు. ఈఎంఐలు, రోజూవారి ఖర్చుల కోసం రాపిడో డ్రైవర్ గా మారాడు’ అని పేర్కొన్నాడు సంజు. ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఇది ఐటీ ఉద్యోగాల డార్క్ రియాలిటీ అని, స్థిరమైన ఆదాయం లేకపోతే అనేక సమస్యలు వస్తాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.









