New Year Liquor Sales Create New Record in Telangana | తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నూతనంగా మద్యం షాపులు ఏర్పాటు చేసుకున్నవారు కాసుల వర్షం చూశారు. కేవలం మూడు రోజుల్లోనే రూ.వెయ్యి కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. గత న్యూ ఇయర్ వేడుకల రికార్డులను బద్దలు కొట్టిన మందుబాబులు సరికొత్త రికార్డులు సృష్టించారు. డిసెంబర్ 29, 30, 31 ఈ మూడు రోజులు కలిపి తెలంగాణలో రూ వెయ్యి కోట్లకు మద్యం అమ్మకాలు జరిగినట్లు రాష్ట్ర ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇకపోతే గత ఆరు రోజుల్లో రూ.1350 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
డిసెంబర్ 29న రూ.280 కోట్లు, 30న రూ.380 కోట్లు, 31న రూ.315 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఇకపోతే నూతనంగా లైసెన్సులు పొందిన వారు డిసెంబర్ నెలలో మద్యం షాపులు తెరిచిన విషయం తెల్సిందే.









