Neeraj Chopra conferred rank of Lieutenant Colonel | భారత జావెలిన్ హీరో, రెండుసార్లు ఒలిపిక్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది లెఫ్టినెంట్ కల్నల్ హోదాను నీరజ్ కు ప్రధానం చేశారు.
అద్భుతమైన క్రీడా విజయాలు, సైనిక సేవకు గుర్తింపుగా ఈ హోదా దక్కింది. నీరజ్ దేశభక్తికి ఉదాహరణగా నిలుస్తూ క్రీడా సమాజం మరియు సాయుధ బలగాలకు స్ఫూర్తిగా నిలిచారని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. 2016లో సుబేదార్ హోదాలో నీరజ్ చోప్రా ఆర్మీలో చేరారు. అనంతరం 2021లో మేజర్ గా పదోన్నతి పొందారు. ఇదిలా ఉండగా నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్ లో రజతం, 2023 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకాలను సాధించిన విషయం తెల్సిందే.









