Navy radar project in Damagundam | దేశ రక్షణలో కీలక భూమిక పోషించే భారత నావికాదళం వికారాబాద్ ( Vikarabad ) జిల్లా దామగుండం ( Damagundam )లో నిర్మించ తలపెట్టిన రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth )కి ఆహ్వానం అందించారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి , దామగుండం రాడార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్ , నేవీ ఉన్నతాధికారులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందజేశారు.
ఈనెల 15న పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టు ( Navy Radar Project ) పనుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే 400 ఏండ్ల చరిత్ర గల దామగుండం రామలింగేశ్వరస్వామి ఆలయం కనుమరుగవుతుందని అలాగే లక్షల సంఖ్యలో విలువైన ఔషధ మొక్కలు అంతరించిపోతాయని పర్యావరణ వేత్తలు, స్థానికులు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే.