Nara Lokesh Counter To Ys Jagan | ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి జగన్.
ఈ సందర్భంగా ‘అమాత్యా మేలుకో..పప్పూ నిద్ర వదులు’ అని ఎద్దేవా చేస్తూ పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. జగన్ ఏడుపులే తమకు దీవెనలు అని అన్నారు. జగన్ ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి జగన్ కు కడుపుమంట రావడం సహజమన్నారు. వైసీపీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా జగన్ కు స్పృహ లేదన్నారు.
కోవిడ్ తరువాత 2022 సెప్టెంబర్‌లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన జగన్ తమను విమర్శించటం అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేశామని, ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారానికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.