Nara Lokesh About Mega DSC | డీఎస్సి భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంత్రి లోకేశ్ శుభవార్త చెప్పారు. వేసవి సెలవుల తర్వాత బడులు తెరిచే లోపే టీచర్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని, వచ్చే విద్యాసంవత్సరం బడులు తెరిచే సమయానికి టీచర్ నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
మార్చి 2025లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ నవ్యాంధ్రలోనూ 80 శాతానికి పైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం పార్టీనేనని తెలిపారు.