- కలెక్టర్ కు ఓ భర్త వింత ఫిర్యాదు!
Uttar Pradesh | ఉత్తర్ ప్రదేశ్ లోని సీతాపూర్ లో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా జిల్లా కలెక్టర్ కు ప్రజల నుంచి అభివృద్ధికి సంబంధించిన వినతులు వస్తుంటాయి. అయితే యూపీలోని సీతాపూర్ ఓ వ్యక్తి ఓ వింత ఫిర్యాదుతో కలెక్టర్ వద్దకు వెళ్లాడు.
రాత్రిపూట నా భార్య పాముగా మారి నన్ను కాటు వేయడానికి ప్రయత్నిస్తోంది సర్. నన్ను కాపాడండి అంటూ ఏకంగా కలెక్టర్ కే మొరపెట్టుకున్నాడు ఓ భర్త. మిరాజ్ అనే వ్యక్తి తన భార్య నసీమున్ నుంచి తనను రక్షించాలంటూ వేడుకున్నాడు. సమాధాన్ దివాస్ సందర్భంగా ఇటీవల జిల్లా మేజిస్ట్రేట్‌కు తన పరిస్థితిని వివరిస్తూ, “సార్, నా భార్య రాత్రిపూట పాముగా మారి నన్ను భయపెడుతుంది” అని ఫిర్యాదు చేశాడు.
తాను నిద్రిస్తున్న సమయంలో అనేక మార్లు చంపడానికి కూడా ప్రయత్నించిందని ఆరోపించాడు. అయితే ప్రతిసారీ తాను సరైన సమయానికి మేల్కొనడం వల్ల ఆమె నుంచి తప్పించుకోగలిగానని తెలిపాడు. ఈ వింత ఆరోపణలకు సంబంధించిన లిఖితపూర్వక దరఖాస్తును కూడా మెరాజ్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.
మిరాజ్ ఫిర్యాదుతో కలెక్టర్ సహా అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. దీంతో కలెక్టర్ తన బాధ్యతగా స్పందించి ఈ విషయంపై వెంటనే పరిశీలించాలని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ఈ ఘటనను మానసిక వేధింపుల కేసుగా పరిగణించి ప్రాథమిక విచారణ ప్రారంభించారు.









