Talasani Srinivas Yadav In Mutyalamma Temple | సికింద్రాబాద్ ( Secunderabad ) మొండా మార్కెట్ లోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో త్వరలోనే ఆలయంలో నూతన విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పలు ప్రముఖ దేవాలయాలకు చెందిన పండితులతో కలిసి పూజలలో తలసాని పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వహకులు, బస్తీ ప్రజలతో మాట్లాడారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా బస్తీ వాసుల సమక్షంలో పూజలని చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు.