MS Dhoni recreates ‘Animal’ scenes in ad directed by Sandeep Reddy Vanga | టీం ఇండియా ( Team India ) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలిసి ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన యాడ్ ( advertisement ) లో కనిపించారు.
ఇందులో ‘యానిమల్’ మూవీలోని రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) క్యారెక్టర్ ను పోలె విధంగా ధోని నటించారు. యాడ్ లో ధోని, సందీప్ మధ్య జరిగిన సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘నాకు వినిపిస్తుంది నేను చెవిటివాన్ని కాదు’ అంటూ ధోని చెప్పిన డైలాగ్ కు నా హీరో రెడీ అయ్యాడు అంటూ సందీప్ రిప్లై ఇచ్చారు.
పొడవాటి జుట్టు, బ్లూ కలర్ సూట్ ధరించి బ్లాక్ కలర్ కారులో ధోని యానిమల్ మూవీ తరహాలో యాడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ సైకిల్ కు సంబంధించిన ఓ కంపనీ యాడ్ కోసం ధోని యానిమల్ లా మారారు. ధోని లుక్స్, డైలాగ్స్ కు సందీప్ వంగ ఫిదా అయిపోయారు.
అలాగే యానిమల్ మూవీలో క్లిమాక్స్ సీన్ కు కూడా రిక్రియేట్ చేశారు. ధోని ఎలక్ట్రిక్ సైకిల్ ను చూపిస్తూ చేతి వేళ్ళతో చేసిన సైగ హైలైట్ గా నిలిచింది. ‘యానిమల్’ ధోని అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన యాడ్ వైరల్ గా మారింది.
ఐపీఎల్-2025 లో భాగంగా ధోని సీఎస్కే తరఫున ఆడేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు.