MS Dhoni Played Big Role In Usman Tariq’s Rise For Pakistan | టీం ఇండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ వ్యాప్తంగా ఎందరో క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ధోని టీం ఇండియాలో చోటు సంపాదించుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని-ది అన్టోల్డ్ స్టోరీ’ సినిమాలో ధోని పడిన కష్టాలను, ఎదురుకున్న ఇబ్బందులను చూపించారు. ఈ సినిమాతో పాకిస్థానీ క్రికెటర్ జీవితమే మారిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా అతడే చెప్పడం విశేషం. టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం టీం ఇండియా-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది.
విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో అతడు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లను కట్టడి చేయగలుగుతున్నాడు. కేవలం నాలుగు అంతర్జాతీయ టీ-20 మ్యాచుల్లోనే 11 వికెట్లు తీశాడు. అయితే ఒకానొక దశలో క్రికెట్ ను వీడి దుబాయ్ లో సేల్స్ మాన్ గా ఉద్యోగంలో చేరాడు. అప్పుడే ఎంఎస్ ధోని సినిమా చూసి మళ్లీ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ద్వారా ధోని పడిన కష్టాన్ని చూసి అతడు కూడా స్ఫూర్తి పొందాడు. ఈ విషయాన్ని ఉస్మాన్ తారిక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. పాకిస్థాన్ క్రికెట్ లో అవకాశాలు లేక దుబాయ్ వెళ్లి అక్కడ సేల్స్ మాన్ గా ఉద్యోగం చేరాడు. ఈ సమయంలో ధోని సినిమాను చూసి స్ఫూర్తి పొందాడు. ధోని పడిన కష్టం అతనిలో ఆశలు చిగురించేలా చేసింది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి మళ్లీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుత ప్రదర్శన చేయడంతో పాకిస్థాన్ జాతీయ జట్టులో అవకాశం లభించింది.










