MP Kesineni Chinni Vs Kolikapudi Srinivasarao | 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు ఇచ్చినట్లు టీడీపీ నేత, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. గత కొన్నిరోజుల నుండి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కొలికపూడి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెల్సిందే.
ఎంపీపై కొలికపూడి కారాలు, మిరియాలు నూరారు. ఇదే సమయంలో గురువారం తన వాట్సప్ స్టేటస్ లో కొలికపూడి చేసిన పోస్ట్ తీవ్ర ప్రకంపనలకు కారణం అయ్యింది. 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం కేశినేని చిన్ని తనను రూ.5 కోట్లు అడిగినట్లు కొలికపూడి పేర్కొన్నారు. దింతో 2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 8న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న మరో రూ.20 లక్షలు ఇలా మూడు దఫాలు కలిపి రూ.60 లక్షలు కేశినేని చిన్నికి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు.
పోరంకిలో కేశినేని చిన్ని పీఏ మోహన్ వచ్చి తీసుకెళ్లిన రూ.50 లక్షల గురించి, గొల్లపూడిలో తన మిత్రుల ఇచ్చిన రూ.3.5 కోట్ల గురించి శుక్రవారం మాట్లాడుతా అంటూ ఆయన సంచలన పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా టీడీపీలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ముదిరిన వివాదంపై తీవ్ర చర్చకు కారణం అయ్యింది.









