Wednesday 23rd October 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మన బంధం చాలా బలమైంది..అనువాదం అవసరం లేదు

మన బంధం చాలా బలమైంది..అనువాదం అవసరం లేదు

Modi-Putin Meeting In Russia | 16వ బ్రిక్స్ ( BRICS ) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం అయ్యింది. రష్యా ( Russia ) లోని కజాన్ ( Kazan ) నగరంలో ఈ సదస్సు జరగనుంది.

ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ( Pm Modi ) రష్యా వెళ్లారు. రష్యా చేరుకున్న అనంతరం అక్కడ లభించిన స్వాగతం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ రష్యా ల మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు.

అనంతరం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin ) తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

తమ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని ఒకరి మాటలు మరొకరు అర్ధం చేసుకోవడానికి అనువాదం అవసరం లేదని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ మాటల నేపథ్యంలో ప్రధాని చిరునవ్వు చిందించారు. కాగా పుతిన్ తో సమావేశం అనంతరం చైనా ( China ) అధ్యక్షుడు జిన్పింగ్ ( Xi Jinping )తో మోదీ భేటీ అవనున్నట్లు తెలుస్తోంది.

You may also like
స్టార్ క్రికెటర్ కెరీర్ ఎందుకిలా అయ్యింది
ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ
బుల్డోజర్ల వ్యాఖ్యలు..సీఎం రేవంత్ పై పోలీసులకు ఫిర్యాదు
కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైంది..ఎస్పీకి దండం పెట్టిన జీవన్ రెడ్డి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions