Sunday 11th May 2025
12:07:03 PM
Home > తాజా > ‘అంబేడ్కర్ ను, దళిత స్పీకర్ నుఅవమానించారు’

‘అంబేడ్కర్ ను, దళిత స్పీకర్ నుఅవమానించారు’

Minister Seethakka On KTR | పార్లమెంట్ లో అంబెడ్కర్ ను, తెలంగాణ అసెంబ్లీ లో దళిత స్పీకర్ ను అవమానించారని మండిపడ్డారు మంత్రి సీతక్క. ఈ మేరకు శుక్రవారం ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

కేబినెట్ ఆమోదం తీసుకొని ఫార్ములా ఈ రేస్ కు కేటీఆర్ డబ్బులు చెల్లించారా? అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతి లేని అంశానికి సభలో చర్చ ఎందుకని ప్రశ్నించారు. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసు కు సభలో చర్చ అవసరం లేదన్నారు.

బీఏసీ లో ఈ ఫార్ములా మీద చర్చ కోసం బిఆర్ఎస్ ఎందుకు అడగలేదని నిలదీశారు. ముసుగు వేసుకుని బిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. జైలు కు వెళ్లి యోగా చేస్తా అన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

తప్పు లేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావచ్చు కదా అని సూచించారు. కేటీఆర్ తన సమస్యను రాష్ట్ర ప్రజల సమస్య గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళితే తప్పు పట్టిన కేటీఆర్.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారని నిలదీశారు.

కేటీఆర్ కు నిజాయితీ లేనీ, లక్షలాది మంది రైతుల ప్రయోజనం చేకూర్చే భూభారతి బిల్లు పై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అందరూ చట్టం ముందు సమానులే.. ఫార్ములా ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.

You may also like
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు
‘ఆడవారి సింధూరాన్ని తుడిచారు..అందుకే’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’
‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions