Tribal Canteen in Aadilabad | సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఉట్నూర్ ఆధ్వర్యంలో గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన గిరిజన క్యాంటీన్ ను శుక్రవారం రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ , ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక గిరిజన భవన్ లో గిరిజన క్యాంటీన్ లో ప్లేట్ మీల్స్ కేవలం రూ. 5 లకే మధ్యాహ్నం 12.00 గంటల నుండి 2.00 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
క్యాంటీన్ ఏర్పాటు చేయడం వలన కొలాం గిరిజనులకు ఉపాధి లభించిందన్నారు. శాశ్వత షెడ్డు నిర్మాణానికి టెండర్ ఖరారు చేయడం జరిగిందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఎమ్మెల్యే వేడ్మ బోజ్జు, తదితరులు పాల్గొన్నారు.