Minister Seethakka Becomes Emotional at Her Husband’s Death Anniversary Meeting | భర్త కుంజా రాము వర్థంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడా మండలం మోకాళ్ళపల్లిలో గురువారం తన భర్త కుంజా రాము వర్ధంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క, కుమారుడు కోడలితో కలిసి పాల్గొన్నారు.
17 ఏళ్ల ప్రాయంలోనే రాము ఉద్యమ బాట పట్టినట్లు చెప్పారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే ఆయన తుదిశ్వాస వరకు పోరాడినట్లు చెప్పారు. ఆయన నుండి స్ఫూర్తి పొందిన తాను పేద వర్గాల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కుంజా రాము స్థూపం వద్ద సీతక్క నివాళులర్పించారు.
ప్రస్తుత జీవితం తనకు బోనస్ అన్నారు. గతంలో ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో తృటిలో ఎన్ కౌంటర్ నుండి తప్పించుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. భర్త రాము అడుగుజాడల్లో నడుస్తూ ఆయన నుండి స్ఫూర్తి పొందిన తాను చివరి వరకు ఆదివాసీ, అట్టడుగు, పేద వర్గాల కోసం మరియు వారి హక్కుల కోసం నిలబడుతానన్నారు. ఈ సందర్భంగా భర్త రామును తలుచుకుని సీతక్క ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న విమలక్క ఆమెను ఓదార్చారు.