Minister Ponnam Invites KCR | తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలను సర్కారు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ క్రమంలో బీఆరెస్ అధినేత కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కలిశారు. ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కు వెళ్లిన మంత్రి కేసీఆర్ ను కలిసి విజయోత్సవాలకు ఆహ్వానించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రి పొన్నం ఆహ్వానించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి తెలంగాణ తల్లి రూపంపై కేసీఆర్ తో ఎటువంటి చర్చ జరగలేదన్నారు. ప్రభుత్వం తరఫున మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. అంతకంటేముందు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లను మంత్రి పొన్నం ఆహ్వానించారు.