Saturday 28th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ ‘దిష్టి’ వ్యాఖ్యలు..అవి ఆ ఉద్దేశ్యంతో అన్నవే!

పవన్ ‘దిష్టి’ వ్యాఖ్యలు..అవి ఆ ఉద్దేశ్యంతో అన్నవే!

Minister Kandula Durgesh Clarification on Pawan Kalyan Disti Comments | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన విషయం తెల్సిందే. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి, జనసేన నేత కందుల దుర్గేశ్. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యలు కేవలం. సామెతగా చేసినవి మాత్రమే అని అంతేకాని ఎవరిని కించపరచడానికి ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు.

పవన్ కళ్యాణ్ కు తెలంగాణ పట్ల అమితమైన ప్రేమ ఉందన్నారు. తెలంగాణ పట్ల అమితమైన అభిమానం చూపించి ఏ చిన్న ప్రకృతి వైపరిత్యం వచ్చినా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున సహాయం చేశారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి అవ్వడానికంటే ముందు కూడా ఏపీకి ఎంత సహాయం చేశారో తెలంగాణకు కూడా అంతే చేశారని తెలిపారు. జనసేన పార్టీ ఏపీతో పాటు తెలంగాణలో కూడా క్రియాశీలకంగా ఉందన్నారు. తెలంగాణ గొప్పతనాన్ని పవన్ అనేకసార్లు కొనియాడారని అలాగే సినిమాల ద్వారా తెలంగాణ కళాకారులను ప్రోత్సహించారని పేర్కొన్నారు.

You may also like
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్
వివాహేతర సంబంధం..విడాకులు కోరిన విజయ్ భార్య
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
లిక్కర్ కేసులో కవితకు రిలీఫ్..కేటీఆర్ ఏమన్నారంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions