Saturday 28th February 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘ఫైనల్ కు ఆ బౌలర్ డౌటే !..టీం ఇండియాకు మంచి అవకాశం’

‘ఫైనల్ కు ఆ బౌలర్ డౌటే !..టీం ఇండియాకు మంచి అవకాశం’

Matt Henry ruled out of IND vs NZ Champions Trophy 2025 Final ? | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 తుది పోరుకు సర్వం సిద్ధమయ్యింది.

ఆస్ట్రేలియా ను చిత్తు చేసి భారత్, సౌత్ ఆఫ్రికాను ఓడించిన న్యూజీలాండ్ ఫైనల్ కు చేరుకున్న విషయం తెల్సిందే. దుబాయ్ వేదికగా ఆదివారం టీం ఇండియా-న్యూజీలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తలపడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

అయితే ఫైనల్ మ్యాచ్ కంటే ముందు న్యూజీలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ బౌలర్, ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసుకున్న మ్యాట్ హెన్రీ ( Matt Henry )ఫైనల్ కు దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సెమీస్ లో సౌత్ ఆఫ్రికా తో కివీస్ తలపడింది.

ఈ మ్యాచ్ సందర్భంగా, హెన్రిచ్ క్లాసెన్ ఆడిన బంతిని క్యాచ్ పట్టే క్రమంలో మ్యాట్ హెన్రీ భుజానికి తీవ్ర గాయమయ్యింది. దింతో అతను ఇబ్బంది పడుతూ, మైదానాన్ని వీడారు. ఇప్పటివరకు ఈ స్టార్ బౌలర్ గాయం నుండి కొలుకోలేదని తెలుస్తోంది.

భుజంపై ప‌డ‌డంతో ప్ర‌స్తుతం మ్యాట్ ఇబ్బందిప‌డుతున్నాడ‌ని, ఒక‌వేళ అత‌ను బౌలింగ్ చేయ‌గ‌లిగితే త‌మ‌కు పాజిటివ్‌గా ఉంటుంద‌ని కోచ్ గ్యారీ స్టీడ్ ( Gary Stead ) తెలిపారు. ఒకవేళ హెన్రీ ఫైనల్ మ్యాచ్ కు దూరం అయితే టీం ఇండియా కు మంచి అవకాశం లభించనట్లే అవుతందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే లీగ్ దశలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో హెన్రీ ఐదు వికెట్లు తీసిన విషయం తెల్సిందే.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions