Monday 14th July 2025
12:07:03 PM
Home > తాజా > ఆరుముళ్ళతో ఒక్కటైన ముగ్గురు

ఆరుముళ్ళతో ఒక్కటైన ముగ్గురు

Man Marries Two Women At Same Time | ఒకే పెళ్లి మండపంలో ఇద్దరు యువతుల్ని వివాహమాడాడు ఓ యువకుడు. అది కూడా ప్రేమించి, ఇద్దరమ్మాయిల్ని వారి కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

ఈ ఘటన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సూర్యదేవ్ లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు అమ్మాయిల్ని ఏక కాలంలో ప్రేమించాడు. ఇద్దరికీ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.

ఇచ్చిన మాట తప్పకూడదు అని భావించిన అతడు ఇరువురిని ప్రేమిస్తున్నట్లు యువతులకు చెప్పాడు. వారు కూడా అంగీకరించడంతో యువతుల కుటుంబ సభ్యులను కూడా ఒప్పించాడు. ఈ నేపథ్యంలో పెళ్లి ఖరారయ్యింది. ఒకే పెళ్లి పత్రికలో ఇద్దరు యువతుల పేర్లను ముద్రించి బంధువులను ఆహ్వానించాడు.

కుటుంబం, సన్నిహితుల సమక్షంలో ఇద్దరు అమ్మాయిలకు ఏకకాలంలో ఆరు ముళ్ళు వేసి వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా అమ్మాయిల భవిష్యత్ కు తాను గ్యారంటీ అంటూ బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చాడు. ఒక్క అమ్మాయే దొరకడం ఘఘనమైన ఈ రోజుల్లో ఒకే మండపంలో ఇద్దరు అమ్మాయిల్ని వివాహం చేసుకోవడం తెగ వైరల్ గా మారింది.

You may also like
‘ఆదర్శ ఘటన..తల్లీ నీకు వందనం’
ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో సీఎం
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ కు కవిత ఫిర్యాదు
తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి..కాల్పుల కలకలం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions