Rs. 100 Cut In LPG Cylinder| అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( International Womens Day ) సందర్భంగా దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Modi ).
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ( LPG Gas Cylinder ) పై రూ. 100 ను తగ్గించనున్నట్లు స్వయంగా ప్రకటించారు మోదీ. ఈ మేరకు ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేసారు.
వంట గ్యాస్ పై రూ.100 తగ్గించడం మూలంగా దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ముఖ్యంగా ‘నారి శక్తి’ ( Naari Shakti ) కి ఈ నిర్ణయం ఎంతగానే ప్రయోజనం చేకూరుస్తుందని ధీమా వ్యక్తంచేశారు ప్రధాని.
వంట గ్యాస్ ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తద్వారా వారికి ఆరోగ్య కరమైన వాతావరణాన్ని అందిస్తున్నామన్నారు.
ఈ నిర్ణయం మహిళలకు సాధికారత కల్పిస్తుందని మరియు వారి ‘ ఈజ్ ఆఫ్ లివింగ్’ ( Ease Of Living ) ను సులభతరం అవుతుందని అభిప్రాయం పడ్డారు మోదీ.










