Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బిష్ణోయ్ గ్యాంగ్ లిస్ట్ లో బాబా సిద్దిఖీ కుమారుడు !

బిష్ణోయ్ గ్యాంగ్ లిస్ట్ లో బాబా సిద్దిఖీ కుమారుడు !

Lawrence Bishnoi Gang News | మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నాయకులు బాబా సిద్దిఖీ ( Baba Siddique ) హత్య సంచలనంగా మారింది. మహా రాజకీయాలను, బాలీవుడ్ ( Bollywood ) ను ఈ హత్య ఉలిక్కిపడేలా చేసింది.

దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరపడంతో బాబా సిద్దిఖీ మరణించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఇప్పటికే ఈ హత్య తమ పనేనంటూ లారెన్స్ బిష్ణోయ్ ( Lawrence Bishnoi ) గ్యాంగ్ ప్రకటించింది. ఇదిలా ఉండగా విచారణ సందర్భంగా పోలీసులకు మరో కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది.

బాబా సిద్దిఖీ కుమారుడు, వంద్రే ఈస్ట్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ ( Zeeshan Siddique ) కూడా బిష్ణోయ్ గ్యాంగ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిందితులు విచారణ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు కథనాలు వస్తున్నాయి.

తండ్రీ కుమారులను చంపేందుకే కాంట్రాక్ట్ ఇచ్చినట్లు షూటర్లు పేర్కొన్నారు. ఇద్దర్ని చంపే వీలు లేకపోతే ఓవర్నో ఒకర్ని చంపాలని పై నుండి ఆదేశాలు వచ్చినట్లు షూటర్లు విచారణ సందర్భంగా తెలిపారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ ( Congress ) తరఫున జీషన్ సిద్దిఖీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాడని ఆయన్ను కాంగ్రెస్ బహిష్కరించింది.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions