Wednesday 11th December 2024
12:07:03 PM
Home > తాజా > ‘సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం?’ : కేటీఆర్

‘సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం?’ : కేటీఆర్

ktr

KTR Slams CM Revanth | హైదరాబాద్ లోని కోఠి డీఎంఈ కార్యాలయం ఎదుట సోమవారం ఆశా వర్కర్లు (Asha Workers) ఆందోళన చేపట్టారు. ఇచ్చిన హామీ మేరకు రూ.18 వేల ఫిక్స్ డ్ సాలరీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు తరలించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

‘ సీఎం రేవంత్..తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం ?
ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా ?
మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యమా ?
ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారు ?
దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్లంటే అంత చులకనా ? ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా ? ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ..ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలుచేస్తున్నారు. మీ సర్కారు దాష్టీకానికి ఆశా నాయకురాలు..
సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది
ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలి..
ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే ఆశా వర్కర్ల ఆగ్రహజ్వాలను తట్టుకోలేరు’ అని కేటీఆర్ హెచ్చరించారు.

You may also like
మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్
పెదరాయుడు తరహాలో మోహన్ బాబు..వీడియో వైరల్
పవన్ కళ్యాణ్ ను బెదిరించిన వ్యక్తి పోలీసుల అదుపులో
పుష్ప-2 లో షెకావత్ పేరు వివాదం..వార్నింగ్ ఇచ్చిన నేత

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions