KTR Satires On CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. హైదరాబాద్ మహా నగరంలో జులై – సెప్టెంబర్ క్వార్టర్ ల్ ఇండ్ల అమ్మకాలు 42 శాతం పడిపోయినట్లు ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదికపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అభివృద్ధి చెందుతున్న మహానగరం సంక్షోభంలోకి వెళ్తుందనడానికి ఈ నివేదికనే నిదర్శనం అని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలనకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.
ఆర్ఆర్ ట్యాక్స్ (RR Tax), పిచ్చి కూల్చివేతల కారణంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపకపోవడంతో.. హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు.
దేశానికే ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయిందన్నారు. రేవంత్ రెడ్డి తీరును ఈ దేశం గమనిస్తుందన్నారు. హైదరాబాద్ నగరం మీ నిర్లక్ష్యాన్ని తప్పకుండా ప్రతిఘటిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.