KTR Reaction On Kavitha Bail | ఢిల్లీ మద్యం పాలసీ ( Delhi Excise Policy ) కేసులో మార్చి 15న బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha )ను ఈడీ ( ED ) అరెస్ట్ చేసింది. నెల అనంతరం సీబీఐ ( CBI ) కూడా ఆమెను అరెస్ట్ చేసింది. అయితే మంగళవారం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థాన ( Supreme Court ) ద్విసభ్య ధర్మాసనం తుదితీర్పును వెలువరించింది.
ఈ నేపథ్యంలో బీఆరెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సోమవారమే బీఆరెస్ అగ్రనేతలు కేటీఆర్ ( KTR ), హరీష్ రావు ( Harish Rao ) మరియు ఇతర ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్నారు. బెయిల్ ( Bail ) మంజూరు అయిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ ( Formalities ) ను పూర్తిచేయడానికు సుప్రీం కోర్టు నుండి కేటీఆర్ ఆటోలో బయలుదేరారు.
ఈ సందర్భంగా సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఊరట లభించింది, న్యాయం గెలిచింది అని ఆయన ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు కవిత బెయిల్ పై ఆమె తండ్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ ( KCR ) ఏ రకంగా స్పందిస్తారో అనేది ఆసక్తిగా మారింది.