KTR On Court relief to Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు క్లీన్ చిట్ లభించిన విషయం తెల్సిందే. లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియా మరియు కవిత సహా 23 మంది పేర్లను రౌస్ అవెన్యూ జిల్లా కోర్టు డిశ్చార్జ్ చేసింది. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
‘కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో ఉన్న ఆప్ ప్రభుత్వాన్ని ‘లిక్కర్ స్కామ్’ అనే పేరుతో కూల్చేశారు. లిక్కర్ స్కామ్ అనే ప్రచారం మూలంగా భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయంగా చాలా నష్టపోయింది. ఈరోజు కవితకి కోర్టులో న్యాయం లభించింది. అదే విధంగా, పార్టీ నాయకులపై పెట్టిన ప్రతి కేసు కూడా తప్పుడు, రాజకీయ ఉద్దేశ్యంతో పెట్టినవే అని స్పష్టంగా రుజువవుతాయి. ఆ సత్యం బయటపడే వరకు, కాంగ్రెస్ మరియు బీజేపీల నుంచి వచ్చే నిరాధార ఆరోపణలు, మీడియా ట్రయల్స్ ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడం కొనసాగుతూనే ఉంటుంది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మీడియా ట్రయల్స్ ‘న్యూ ఇండియా’లో సాధారణమైపోయాయి. కానీ చివరికి న్యాయం గెలుస్తుంది.’ అని కేటీఆర్ పేర్కొన్నారు.










