KTR Fires On Congress | తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం (Kaleswaram Project) ప్రాజెక్టుపై సీబీఐ (CBI) విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ సర్కార్ పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేశారు కేటీఆర్. ‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణలో రాహుల్ గాంధీకి కరెన్సీ మేనేజర్ (CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్గా సీబీఐని గతంలో రాహుల్ గాంధీ అభివర్ణించారు.
మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తమపై ఎన్ని కుట్రలు చేసినా.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
న్యాయ వ్యవస్థ, ప్రజలపై తమకు నమ్మకం ఉంది. సత్యమేవ జయతే’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐని ఉద్దేశించి రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.









