KTR files Rs. 10 cr defamation suit against Bandi Sanjay | భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరియు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఈ దావాలో, పరువు నష్టం కలిగించినందుకు గాను తప్పుడు సమాచారాన్ని తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, మరియు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తన న్యాయవాది ద్వారా ఈ కేసు నమోదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆగస్ట్ 8న బండి సంజయ్ సిట్ విచారణకు హాజరైన విషయం తెల్సిందే. అనంతరం ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు. అయితే బండి స్పందించకపోవడంతో తాజగా రూ.10 కోట్ల పరువునష్టం దావా వేశారు.









