KTR Files Quash Petition In High Court | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) హై కోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ ( ACB ) కేసును నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ క్వాష్ ( Quash ) పిటిషన్ దాఖలు చేశారు.
శుక్రవారం భోజనం విరామం తర్వాత దీనిపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. కాగా ఫార్ములా ఈ కారు రేస్ నిర్వహుకులతో నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందం చేసుకున్నారని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కేబినెట్ అనుమతి లేకుండా అలాగే ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారని అభియోగాలు మోపారు. దింతో ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ ను ఏ-1 గా, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను ఏ-2 గా, బీఎల్ఎన్ రెడ్డిని ఏ-3 గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.