Friday 18th October 2024
12:07:03 PM
Home > తాజా > అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? : కేటీఆర్

అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? : కేటీఆర్

KTR Criticises Cm Revanth For Rs. 80500 Cr Debt | రేవంత్ ( Revanth Reddy ) కుర్చీ ఎక్కిన రోజు నుండి తెచ్చిన మొత్తం అప్పులు 80,500 కోట్లు అని తెలిపారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ). 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారని కాంగ్రెస్ సర్కారు పై మండిపడ్డారు.

అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి..? ఎన్నికల హమీలేవీ తీర్చలేదు..! ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు అని నిలదీశారు.

మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు ? 80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు ?? అని కేటీఆర్ అనుమానం వ్యక్తపరిచారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా ? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా ?? అంటూ ప్రశ్నించారు.

అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి…అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి ? అని విమర్శించారు. బీఆర్ఎస్ ( Brs ) హయాంలో.. అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టాం.. ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచాం….తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చాం..కానీ ముఖ్యమంత్రి రేవంత్ తెస్తున్న అప్పుల “అడ్రస్” ఎక్కడ ? అని అడిగారు.

రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా..సొంత ఆస్తులు పెంచుకోవడానికి..అప్పులు చేయడం క్షమించరాని నేరం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం అని కేటీఆర్ హెచ్చరించారు.

You may also like
ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్
పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్
జమ్మూ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం..హాజరైన రాహుల్ గాంధీ
అల్లు అర్జున్ పై కొండంత అభిమానం..సైకిల్ మీద UP to HYD

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions