Tuesday 31st March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కేరళ ఎన్నికల ప్రచారంలో ట్రంప్, పుతిన్.. AI వీడియో వైరల్!

కేరళ ఎన్నికల ప్రచారంలో ట్రంప్, పుతిన్.. AI వీడియో వైరల్!

kerala polls

Global Leaders in Kerala Election Campaign | కేరళ అసెంబ్లీ ఎన్నికల (Kerala Assembly Elections) వేడి తారస్థాయికి చేరిన వేళ.. సోషల్ మీడియాలో ఒక వింత వీడియో హల్చల్ చేస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి గ్లోబల్ లీడర్లు కేరళ వీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఉన్న ఈ వీడియో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

‘ఆర్టిలెన్స్’ (Artillense) అనే సంస్థ సృష్టించిన ఈ AI వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తెల్ల చొక్కా, కేరళ సాంప్రదాయ  పంచె కట్టుకుని, మెడలో కాషాయ కండువాతో ఓపెన్ టాప్ మహీంద్రా జీపుపై నిలబడి ఓట్లు అడుగుతున్న దృశ్యం హైలైట్‌గా నిలిచింది.

ఆయన వెనుక “ఓట్ ఫర్ ట్రంప్” అనే బ్యానర్ కూడా ఉండటం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బ్లూ కలర్ షర్ట్, ముండు ధరించి ఒక రద్దీగా ఉండే మార్కెట్‌లో మహిళలకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో పుతిన్, జిన్ పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వంటి వారు కూడా కేరళ సంస్కృతికి తగ్గట్లుగా ప్రచారంలో పాల్గొంటున్నట్లు చూపించారు. ఈ ఏఐ వీడియో కేరళ ఎన్నికల ప్రచారంలో తెగ వైరల్ అవుతోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions