Naari Puraskar Awards | కేబీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (KBK Group) మేనేజింగ్ డైరెక్టర్ గా విశిష్ట సేవలు అందిస్తూ, సంస్థ విజయాల్లో కీలక పాత్ర పోషించిన శ్రీమతి కొప్పిశెట్టి జయ వైష్ణవికి హెచ్ఎంటీవీ నారీ పురస్కార్ అవార్డు (HMTV Naari Puraskar) దక్కింది.
మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను హెచ్ఎంటీవీ ఈ నారీ పురస్కార్ అవార్డులు (Naari Puraskar Awards) ప్రకటించింది.
అందులో భాగంగా ఐటీ రంగంలో అందించిన సేవలకు గానూ జయ వైష్ణవి ఈ నారీ పురస్కార్ అవార్డుకు ఎంపికయ్యారు.
Read Also: Save Organs Save Life: KBK Hospital ఆధ్వర్యంలో నెల రోజులు ఉచిత హెల్త్ క్యాంప్!
శుక్రవారం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెషన్స్ సెంటర్ లో జరిగిన అవార్డుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మినిస్టర్ రోజా సెల్వమణి, బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జయ వైష్ణవి నారీ పురస్కార్ అవార్డు అందుకున్నారు.
అనంతరం జయ వైష్ణవి మాట్లాడుతూ కేబీకే గ్రూప్ తరఫున నారీ పురస్కార్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ అవార్డుకు ఎంపిక చేసిన హెచ్ఎంటీవీ సీఈవో లక్ష్మి గారికి, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కేబీకే గ్రూప్ లో తన సేవలు గుర్తించి, ప్రోత్సహించిన సీఈవో కక్కిరేణి భరత్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కేబీకే గ్రూప్ సీఈవో భరత్ కుమార్ మాట్లాడుతూ తమ కంపెనీ ప్రతినిధికి ఈ నారీ పురస్కార్ అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు. ఈ అవార్డు అందుకున్న జయ వైష్ణవిని ప్రత్యేకంగా అభినందించారు.
కేబీకే గ్రూప్ సంస్థ విజయాల్లో వైష్ణవి పాత్రం చాలా కీలకం అని కొనియాడారు. డిజిటల్ మార్కెటింగ్ సేవలు, కేబీకే హాస్పిటల్స్, ఐటీ రిక్రూట్ మెంట్ విభాగాల్లో కేబీకే గ్రూప్ సక్సెస్ వెనక ఉన్న ఉద్యోగులు, శ్రేయోభిలాషులను భరత్ కుమార్ ప్రత్యేకంగా ప్రశంసించారు.