Friday 18th October 2024
12:07:03 PM
Home > తెలంగాణ > KBK Group అధినేత డా. భరత్ కుమార్ కు రాష్ట్రీయ గౌరవ్ అవార్డు!

KBK Group అధినేత డా. భరత్ కుమార్ కు రాష్ట్రీయ గౌరవ్ అవార్డు!

Rashtriya Gaurav Award For KBK | కేబీకే గ్రూప్ అధినేత డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్ (Kakkireni Bharat Kumar) కు అరుదైన అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తూ, అసాధారణ విజయాలు సాధించిన వారికి ప్రధానం చేసే రాష్ట్రీయ గౌరవ్ (Rashtriya Gaurav Award) అవార్డు అందుకున్నారు డాక్టర్ భరత్ కుమార్.

కేబీకే గ్రూప్ ద్వారా ఐటీ, హాస్పిటల్, డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు గెలుచుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ లక్డీకాపుల్ లోని ఎఫ్టీసీసీఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భరత్ కుమార్ కు నిర్వాహకులు ఈ అవార్డు అందజేశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి చేతుల మీదుగా భరత్ కుమార్ రాష్ట్రీయ గౌరవ్ అవార్డు అందుకున్నారు.

అనంతరం డా. భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రీయ గౌరవ్ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. కేబీకే గ్రూప్ ద్వారా అందించే సేవలను మరింత విస్తరించి, ఉపాధి అవకాశాలను పెంచాలనే లక్ష్యంతో కృషి చేస్తామని చెప్పారు.

అరుదైన వ్యాధులకు అత్యాధునిక చికిత్స అందిస్తూ..

ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్న డా. భరత్ కుమార్ కేబీకే హాస్పిటల్స్ (KBK Hospitals) ద్వారా వైద్య విభాగంలో అరుదైన వ్యాధులకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు.

షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌తోపాటు సాధార‌ణ రోగుల‌నూ దీర్ఘ‌కాలికంగా వేధిస్తున్న గ్యాంగ్రీన్, డ‌యాబెటిక్ ఫుట్ అల్స‌ర్స్‌, స్కిన్ అల్స‌ర్స్, కాలిన గాయాలు, రోడ్డు ప్ర‌మాదాల కార‌ణంగా ఏర్ప‌డ్డ తీవ్ర‌మైన గాయాలు, బోద‌కాలు పుండ్లు, పాము కాటు గాయ‌ల‌కు ప్ర‌త్యేక చికిత్స చేస్తున్నారు.

ఆయా గాయాల‌కు ఆంపుటేష‌న్ అంటే శ‌స్త్ర చికిత్స ద్వారా అవ‌యవాలు తొల‌గించాల్సిన అవ‌స‌రం లేకుండా శాశ్వతంగా న‌యం చేస్తుంది కేబీకే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, హయత్ నగర్ లో ఉన్న వైద్య సేవలను అతిత్వరలో రెండు రాష్ట్రాలకు విస్తరించనున్నారు.

You may also like
cellulites
సెల్యూలైటిస్.. అప్రమత్తత లేకపోతే అపాయమే!
Kakkireni Bharath Kumar
KBK Group అధినేత భరత్ కుమార్ కు మరో అరుదైన ఘనత!
కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనాథలకు అన్నదానం!
vemula veeresham
షుగర్ పుండ్లకు కేబీకే హాస్పిటల్స్ చికిత్స అద్భుతం: వేముల వీరేశం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions